Yadadri temple crowded with devotees: ఆదివారం సందర్భంగా రాష్ట్రంలోని పలు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. స్వామి ఉచిత దర్శనానికి 2గంటల సమయం పట్టగా... ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది.
ఆలయాల్లో పెరిగిన భక్తులరద్దీ.. ఆ సమయంలో దర్శనాలు నిలిపివేత - యాదాద్రి తాజా సమాచారం
Bhadrachalam temple crowded with devotees: రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు భద్రాద్రి రామయ్య సన్నిదికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పట్టగా.. ఈనెల 25న పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా భద్రాద్రి రామయ్య దర్శనం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు నిలిపివేయనున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి.
![ఆలయాల్లో పెరిగిన భక్తులరద్దీ.. ఆ సమయంలో దర్శనాలు నిలిపివేత Yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16727958-962-16727958-1666521761537.jpg)
Yadadri temple
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. రాములవారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రేపు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాములకు మంగళ స్నానాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈనెల 25న పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా భద్రాద్రి రామాలయాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
భక్తులతో కిటకిటలాడిన రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు
ఇవీ చదవండి: