ఐటీడీఏ పీవో గౌతమ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ సెంటర్లోని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.
భద్రాచలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు - భద్రాచలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
ఆదివాసీల సంప్రదాయాలను గుర్తుంచుకునే విధంగా వారు వాడిన ప్రతి వస్తువుని భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐటీడీఏ పీవో గౌతమ్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భద్రాచలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
అనంతరం మ్యూజియంలో ఆదివాసీలు వాడిన వస్తువులను గౌతమ్ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న తరం.. రాబోవు తరాలవారు ఆదివాసీల సంప్రదాయాలను గుర్తుంచుకునేలా.. వారు వాడిన వస్తువులను మ్యూజియంలో భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్