భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసి డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. డిపో మేనేజర్ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. డిపోలో అనేక సమస్యల నడుమ పనిచేస్తున్న ఉద్యోగులపై.. డిపో మేనేజర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.
సరైన డ్యూటీలు లేకపోవడం వల్ల ఈనెల వెయ్యిలోపే జీతాలు వచ్చాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతుందని తెలిపారు. హైదరాబాద్ డ్యూటీలకు వెళ్లిన వారిని కాలనీవాసులు ఇంటికి రానివ్వడం లేదని.. ఆర్టీసీ డిపోలోనే ఉండాలని గొడవకు దిగుతున్నారని తమ గోడు వెల్లబోసుకున్నారు.