తెలంగాణ

telangana

ETV Bharat / state

మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు - మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు

విపరీతమైన చలిలో తెల్లవారుజాము నుంచే మీ సేవ కేంద్రాల వద్ద మహిళలు పడిగాపులు కాస్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుల అనుసంధానం కోసం బారులు తీరారు. బూర్గంపాడు మండలంలో ఐదు మీసేవ కేంద్రాలు ఉన్నప్పటికీ ఒక్కటీ పనిచేయకపోవడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

women waiting for aadhar attach to ration card at bhadrachalam mee seva centres in bhadradri kothagudem
మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు

By

Published : Dec 30, 2020, 11:25 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఆధార్ కార్డు అనుసంధానం చేస్తేనే రేషన్ బియ్యం ఇస్తామని డీలర్లు ప్రకటించడం వల్ల రేషన్ కార్డుదారులు మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఆధార్ అనుసంధానం కోసం మహిళలు విపరీతమైన చలిలో తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. బూర్గంపాడు మండలంలో ఐదు మీసేవ కేంద్రాలు ఉన్నప్పటికీ ఒక్కటీ పనిచేయడం లేదు. భద్రాచలంలోనూ ఒక్క మీసేవ కేంద్రం మాత్రమే ఆధార్ కార్డులను రేషన్ కార్డుకు అనుసంధానం చేస్తోంది. భద్రాచలంలోని రేషన్ కార్డుదారులు అంబేడ్కర్ సెంటర్లో ఉన్న మీసేవ కేంద్రం వద్ద బారులు తీరారు.

రోజుకి పరిమిత సంఖ్యలోనే అనుసంధానం చేస్తామని మీసేవ కేంద్రం నిర్వాహకులు ప్రకటించడం వల్ల ఉదయం ఆరు గంటల నుంచే మహిళలు భద్రాచలంలోని మీ సేవ కేంద్రానికి వచ్చి ఎదురుచూస్తున్నారు. కరోనాను లెక్క చేయకుండా గుంపులు గుంపులుగా మీ సేవ కేంద్రాల వద్ద వేచి చూస్తున్నారు. బూర్గంపాడు మండలంలోని 5 మీసేవ కేంద్రాలు పని చేయకుండా భద్రాచలంలోని ఈ ఒక్క మీ సేవ కేంద్రం పని చేయడంలో ఆంతర్యమేంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:రామోజీరావు బ్లాంక్ చెక్ ఇచ్చారు: సుధాచంద్రన్

ABOUT THE AUTHOR

...view details