తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనుమతి కోసం రూ.50 వేలు డిమాండ్​ చేస్తున్నారు' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

ఇంటి నిర్మాణం అనుమతి కోసం పురపాలక సిబ్బంది రూ. 50వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అధికారుల సూచనతో నిర్మాణాన్ని తొలగించేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని పురపాలక ఉద్యోగి సదరు మహిళపై ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

woman complained to the police about the municipal staff in Bhadradri Kothagudem District
'అనుమతి కోసం రూ. 50 వేలు డిమాండ్​ చేస్తున్నారు'

By

Published : Mar 10, 2021, 5:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇంటి నిర్మాణం కోసం పురపాలక సిబ్బంది రూ.50వేలు డిమాండ్ చేస్తున్నారని సుచిత్ర అనే మహిళ ఆరోపించారు. పట్టణంలోని 14వ నెంబర్ బస్తీలో గత సంవత్సరం నవంబర్​లో ఇంటి నిర్మాణం అనుమతి కోసం రూ.20 వేలు తీసుకుని... కేవలం రూ.9 వేల 571కి మాత్రమే రసీదు ఇచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటరి మహిళగా ఉన్న తనతో అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు.

మరోవైపు అధికారుల ఆదేశాలతో సరైన పత్రాలు లేకుండా నిర్మిస్తున్న ఇంటిని తొలగించేందుకు జేసీబీతో వెళ్లినట్లు... పురపాలక ఉద్యోగి రవీందర్ తెలిపారు. ఆ సమయంలో అసభ్య పదజాలంతో తనను దూషించి, దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురపాలక ఒప్పంద కార్మికులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పురపాలక ఉద్యోగి ఫిర్యాదు

ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసు.. విచారణ ఈ నెల 15కు వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details