భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి యోగా ఒక వైద్యంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఆయన యోగాసనాలు వేశారు. ప్రజలకు శారీరక శ్రమతో పాటు మంచి ఆహారపు అలవాట్లు ఉంటే అనారోగ్యం దరిచేరదని సూచించారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : విప్ రేగా కాంతారావు - రేగా కాంతారావు యోగాసనాలు
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఆయన యోగాసనాలు వేశారు.
రేగా కాంతారావు యోగాసనాలు
కరోనా వైరస్ నివారణకు ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని కోరారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు.