భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం ఆనకట్ట పైనుంచి గోదావరి పొంగిపొర్లుతోంది. ఎగువన కురుస్తోన్న వర్షాలతో గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దుమ్ముగూడెం ఆనకట్ట పైనుంచి గోదావరి అడుగు ఎత్తున పొంగిపొర్లుతోంది.
గోదావరిలో క్రమంగా పెరుగుతోన్న నీటి మట్టం! - badradri district latest news
ఎగువన కురుస్తోన్న వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దుమ్ముగూడెం ఆనకట్ట పైనుంచి నీరు పొంగిపొర్లుతోంది.
గోదావరిలో క్రమంగా పెరుగుతోన్న నీటి మట్టం!
మరోవైపు ఆనకట్టకు 200 మీటర్ల దూరంలో గోదావరిలో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గోదావరిలో ఆనకట్టకు సమాంతరంగా 600 మీటర్ల వరకు యూ ఆకారంలో కాపర్ డ్యామ్ నిర్మించి మధ్యలో సీతమ్మ సాగర్ పునాది పనులు చేపడుతున్నారు. గోదావరి ఆనకట్ట పైనుంచి పొంగిపొర్లుతున్న నీరు కాపర్ డ్యాం మధ్య ప్రదేశం వరకు విస్తరించి అవతల వైపు నుంచి గోదావరిలోకి ప్రవహిస్తోంది.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమైన అధికార యంత్రాంగం