భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలంలోని బాటన్న నగర్లో గుత్తి కోయ గ్రామస్థులకు పోలీసు అధికారులు వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశారు. ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అభివృద్ధి, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. వేసవి కాలంలో స్వచ్ఛమైన మంచినీటిని అందించడం కోసం ఫిల్టర్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేసిన పోలీసులు - వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేసిన పోలీసులు
పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సామాజిక బాధ్యతలనూ కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి జిల్లా అల్లపల్లి మండలంలో వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశారు.
water filters distribution, guthikoya, badradri kothagudem
పరిశుభ్రమైన నీటిని తాగాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి, టేకులపల్లి సీఐ రాజు, అల్లపల్లి ఎస్సై సంతోశ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పేదలకు 2 నెలలు ఉచితంగా రేషన్!