తెలంగాణ

telangana

ETV Bharat / state

పొంగి పొంగి జారుతోంది జలధార.. - భద్రాద్రి కొత్తగూడెంలో వాటర్​పాల్స్​

మారుమూల కీకారణ్యం.. పక్షుల కిలకిలరావాలు.. కొండలపై నుంచి జాలువారే జలపాతం. నాలుగు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ జలపాతం ఎగిసిపడుతోంది. జాలువారే జలపాత అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

పొంగి పొంగి జారుతోంది జలధార..
పొంగి పొంగి జారుతోంది జలధార..

By

Published : Aug 14, 2020, 10:09 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సోమాలమ్మ జలపాతాన్ని చూసేందుకు కొందరు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మండల కేంద్రం నుంచి ఉంజుపల్లి గ్రామానికి వెళ్లే అటవీ మార్గంలో 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే ఈ జలపాతం కనువిందు చేస్తోంది.

కొండలపై నుంచి జాలువారుతూ వచ్చే ఈ జలపాతాన్ని చూసేందుకు వర్షంలోనూ కొందరు యువకులు ఉత్సాహం చూపారు. ఈ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించి అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా అవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

పొంగి పొంగి జారుతోంది జలధార..

ABOUT THE AUTHOR

...view details