భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన గోడపత్రికలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఈ కరపత్రాలు, గోడపత్రికలు అంటించారు. చర్ల మండలంలోని పలు గ్రామాలతో పాటు బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్డు, అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఈ గోడ పత్రికలను అంటించి వెళ్లారు.
ఆదివాసీల ఉసురుతీస్తుంది ఎవరు?... ఏజెన్సీలో గోడపత్రికల కలకలం... - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోడపత్రికల కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన గోడపత్రికలు కలకలం రేపాయి. అమాయకపు ఆదివాసీల ఉసురుతీస్తుంది ఎవరంటూ గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాలు, గోడప్రతులు విడుదల చేయడం గిరిజన గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆదివాసీలను హత్య చేస్తుంది ఎవరు?... ఏజెన్సీలో గోడపత్రికల కలకలం...
వీటిలో 'అమాయక ఆదివాసీల ఉసురుతీస్తుంది ఎవరు' అని పేర్కొన్నారు. మావోయిస్టులే ఆదివాసీలను హింసలకు గురిచేస్తున్నారని ప్రజలందరికీ తెలియాలని ఈ గోడ ప్రతులు విడుదల చేసిన్నట్లు ఏజెన్సీలోని ప్రజల్లో చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి:మావోయిస్టులే గంజాయి వ్యాపారస్థులు... మన్యంలో గోడ పత్రిక కలకలం