తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువత - latest news of waiting for tsrtc jobs in bhadradri

ఆర్టీసీ సమ్మె కారణంగా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్ల కోసం అధికారులు నియమాకాలు చేపట్టారు. విధులు నిర్వహించేందుకు మణుగూరులో యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువత

By

Published : Oct 15, 2019, 5:35 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఉద్యోగాల కోసం యువతీ యువకులు పోటీ పడుతున్నారు. సుమారు 500 మంది తెల్లవారుజామున డిపోకి చేరుకొని విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని... తమకు అవకాశం కల్పించాలని కోరారు. విధులు నిర్వహించేందుకు వచ్చిన వారి పేర్లు అధికారులు నమోదు చేసుకొని క్రమపద్ధతిలో విధులకు పంపిస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువత

ABOUT THE AUTHOR

...view details