సకల దేవతలు ఒకే చోట చేరి పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమివ్వడం వల్ల భద్రాద్రి ఆలయ ప్రాంతాలన్నీ దేదీప్యమానంగా విరాజిల్లాయి. నిత్యం దర్శనమిచ్చే భద్రాద్రి రామయ్యతో పాటు ఉపాలయాల్లో వేంచేసి ఉన్న దేవతామూర్తులు అంతా ఒకే చోట పూజలు అందుకోవడం వల్ల స్వర్గలోకం భువికి దిగివచ్చినట్లు భక్తులు పరవశించిపోయారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విశ్వరూప సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు పూర్తయిన తర్వాత చివరి రోజున విశ్వరూప సేవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. భద్రాద్రి రామయ్యకు జరిగే ప్రభుత్వోత్సవానికి ఉప ఆలయాల్లోని దేవతామూర్తులను కూడా బేడా మండపంలోకి తీసుకొచ్చారు.
భద్రాద్రిలో వైభవంగా విశ్వరూప సేవ - telangana varthalu
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విశ్వరూప సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజలాంఛనాలతో భద్రాద్రి రామయ్యకు ప్రభుత్వోత్సవాన్ని నిర్వహించారు.
భద్రాద్రిలో వైభవంగా విశ్వరూప సేవ
అనంతరం రాజుకు జరిగే రాజలాంఛనాలతో భద్రాద్రి రామయ్యకు ప్రభుత్వోత్సవాన్ని నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా... అర్చకులు మంత్రోచ్ఛరణలు వినిపిస్తుండగా రామయ్యకు, సకల దేవతలకు దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదలివచ్చారు అనంతరం ఆలయ సిబ్బంది కదంబం ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: మనసు దోచే లక్నవరం.. పర్యటకుల పాలిట స్వర్గధామం