భద్రాద్రి రామయ్యను హీరో శ్రీకాంత్, ఛత్తీస్గఢ్ వాణిజ్య మంత్రి కవాసి లక్మా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
హీరో శ్రీకాంత్
By
Published : Feb 4, 2019, 4:00 AM IST
హీరో శ్రీకాంత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామయ్యను ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్, ఛత్తీస్గఢ్ వాణిజ్య మంత్రి కావాసి లక్మా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తనకు మంత్రి పదవి రావడంపై మంత్రి కావాసి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.