భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృత పర్యటన చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు నష్ట పరిహారం అందించేలా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను, ఇళ్లు కూలిపోయిన బాధితులను ఆయన పరామర్శించారు. వరద ధాటికి దెబ్బ తిన్న వంతెనలు, రహదారులను పరిశీలించారు.
వరదల నష్టాన్ని.. సీఎం దృష్టికి తీసుకెళ్తా : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు - Government VIP Rega Kantharao Visited Pinapaka Flood Area
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం వచ్చేలా ప్రయత్నిస్తానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
వరదల నష్టాన్ని.. సీఎం దృష్టికి తీసుకెళ్తా : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
రైతులు, ప్రజలు అధైర్య పడవద్దని.. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వరద నష్టం గురించి రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావిస్తామని అన్నారు. నష్టాన్ని అంచనా వేసేలా నివేదిక తయారు చేస్తున్నామని, బాధితులందరికీ ప్రభుత్వ సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. విపత్కర సమయంలో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు.
ఇదీ చూడండి:గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!