భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెంలో భారీగా కరెంట్ బిల్లులు వచ్చాయని వినియోగదారులు రోడ్డెక్కారు. గత నెల రెండు నుంచి ఐదు వందల వరకు వచ్చే బిల్లు ఈ నెల రూ.5వేలకు పైగా రావడం వల్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ గ్రామానికి వచ్చి రెండోసారి విద్యుత్ మీటర్లు తనిఖీ చేసి కచ్చితమైన బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.
వినియోగదారులకు కరెంట్ బిల్లుల షాక్ - villagers protest
అధిక మొత్తంలో కరెంట్ బిల్లులు వచ్చాయంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖాధికారులు వచ్చి నచ్చజెప్పడం వల్ల శాంతించారు.
వినియోగదారులకు కరెంట్ బిల్లుల షాక్