తెలంగాణ

telangana

ETV Bharat / state

villagers kill a python: ఆ ఇళ్లలో కోళ్లు, గుడ్లు ఎవరు కాజేస్తున్నారో చూసి షాకయ్యారు.. - కొండ చిలువను కొట్టి చంపిన స్థానికులు

ఇంట్లో ఉన్న కోడిగుడ్లు, కోళ్లు మాయమవుతున్నాయి. రోడ్డు పక్కన తాళం వేసి ఉన్న ఆ ఇళ్లలోంచి అవి ఎలా మాయమవుతున్నాయో అర్థం కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంత చాకచక్యంగా ఎవకు ఎత్తుకుపోతున్నారా అని నిఘా పెట్టారు. బయట వ్యక్తులు వచ్చే అవకాశం లేదని... ఇది పిల్లి పనేమోనని కాపు కాసారు. ఇంతలో అక్కడికి వచ్చిన దానిని చూసి గుండెఝళ్లుమంది. ఇంతకీ ఆ కోళ్లు ఎవరు ఎత్తుకు పోతున్నారు.. అక్కడికి వచ్చింది ఏమిటంటే..

python
python

By

Published : Sep 28, 2021, 11:56 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(bhadradri kothagudem) గుండాల మండలం లింగగూడెంలో రోడ్డువైపున ఇళ్లలో కొన్ని రోజులుగా కోడిగుడ్లు, కోళ్లు మాయవతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి వాటిని ఎవరో ఎత్తుకెళ్తున్నట్లు గమనించారు. ఇది దొంగల పని, పిల్లుల పని కాదని నిర్ధారించుకుని... నిఘా పెట్టారు.

కారు చీకటి క్రమంగా అలుముకుంటుంది. దొంగ కోసం స్థానికులు గోడమాటున నక్కి కూర్చున్నారు స్థానికులు. ఇంతలో అక్కడికి మెల్లగా పాకుకుంటూ ఓ భారీ కొండ చిలువ వచ్చింది. రోజూ కోళ్లు, కోడిగుడ్లు తింటూ.. బాగా అలవాటుపడిన ప్రదేశానికి చేరుకుంది. కోళ్లు తినడానికి వచ్చిన కొండచిలువను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకుని తలో కర్ర, గొడ్డలి తీసుకుని కొండ చిలువను కొట్టి చంపారు(villagers kill a python).

ఇదీ చూడండి:Lovers Suicide in Gadwal : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details