భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిగిరిపై కొలువైన సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి విలాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు వేంకటేశ్వరుని అవతారంలో దర్శనమిచ్చారు. తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవం - భద్రాచలం వార్తలు
భద్రాచలంలో విలాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వరస్వామి అలంకారంలో దర్శనమిచ్చిన రాములవారికి చిత్రకూట మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
![భద్రాద్రి రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవం భద్రాద్రి రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10135036-thumbnail-3x2-bhadradri-rk.jpg)
భద్రాద్రి రామయ్య సన్నిధిలో విలాస ఉత్సవం
ఆలయం నిర్మించినప్పుడు భక్త రామదాసు ఈ ఉత్సవాలు నిర్వహించగా.... అనంతరం భద్రాచలం తహసీల్దార్ స్థానంలో ఉన్నవారు పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 10న స్వామివారికి విశ్వరూప సేవ చేయనున్నారు.