Vanama Raghava victims: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతోనే మేమందరం బయటకు వచ్చాం. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వనమా రాఘవ కబ్జా చేసిన భూముల్లో ఆయన మనుషులు ఉంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుని.. మళ్లీ ఇలాంటి అరాచకాలు జరగకుండా చూడాలి. -- బాధితులు
వెలుగులోకి వనమా రాఘవ అరాచకాలు.. పోలీస్ స్టేషన్కు బాధితుల క్యూ - vanama raghava arrest
Vanama Raghava victims: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ ఆస్తులు కబ్జా చేశారంటూ బాధితులు పాల్వంచ ఏఎస్పీ కార్యాలయానికి వచ్చారు. రాఘవను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వనమా రాఘవ బాధితులు