భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు వామనావతారంలో ఉన్న స్వామివారిని బేడా మండపంలో వేంచేపింపచేసి ఆలయ అర్చకులు, వేద పండితులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం రాజభోగం మహానివేదన అనంతరం స్వామి వారు సకల రాజ లాంఛనాల నడుమ తిరువీధి సేవకు బయలుదేరారు.
వామనావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం - తెలంగాణ తాజా వార్తలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యాయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో 5వ రోజైన నేడు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వామనావతారంలో భద్రాద్రి రామయ్య
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు జనవరి 1 నుంచి మొదలుకానున్నాయి. జనవరి 1న సీతారాములకు తెప్పోత్సవం, 2న ముక్కోటి ఏకాదశి రోజు సీతారాముల ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా జనవరి 2 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు.
ఇవీ చదవండి :