భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో... వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఐదోరోజు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అవతారంలో దర్శనమిస్తోన్న రామయ్య... నేడు వామనావతారంలో భక్తుల ముందుకొచ్చారు.
ఐదోరోజు వామనావతారంలో భద్రాద్రి రామయ్య - ఐదోరోజు వామనావతారంలో భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదోరోజు రాములవారు వామనావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బేడా మండపంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బేడా మండపంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు పటిస్తూ రాములవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. వామనావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల గురు గ్రహ బాధలు తొలగుతాయని అర్చకులు తెలుపుతున్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి:నరసింహావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు