తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్‌లైన్‌లో వైకుంఠద్వార దర్శన టికెట్లు.. - Vaikuntha Dwara Darshan Tickets in Online

భద్రాద్రి ఆలయంలో ఈ నెల 23 నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించే ఉత్తర ద్వార దర్శన పూజలను ప్రత్యక్షంగా వీక్షించే వారి కోసం టికెట్లను విక్రయించనున్నారు. నేటి నుంచి టికెట్లు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో వైకుంఠద్వార దర్శన టికెట్లు..
ఆన్‌లైన్‌లో వైకుంఠద్వార దర్శన టికెట్లు..

By

Published : Dec 1, 2022, 8:35 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ నెల 23 నుంచి శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో 2023 జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం ఉంటుంది. 2న ఉదయం నిర్వహించే ఉత్తర(వైకుంఠ) ద్వార దర్శన పూజలను ప్రత్యక్షంగా వీక్షించే వారి కోసం సెక్టార్లను సిద్ధం చేసి వీటి టికెట్లను విక్రయించనున్నారు. నేటి నుంచి రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.500, రూ.250ల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని భద్రాచలం రామాలయ కార్యనిర్వహణాధికారి శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

www.bhadrachalamonline.comవెబ్‌సైట్‌ ద్వారా భక్తులు వీటిని పొందవచ్చని చెప్పారు. భద్రాద్రి జిల్లా పరిధిలోని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు, రామాలయంలోని ప్రధాన కౌంటర్‌, తానీషా కల్యాణ మండపం, బ్రిడ్జి వద్ద ఉన్న రామాలయ సమాచార కౌంటర్‌లో ఈ టికెట్లు నేరుగా విక్రయించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details