భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు కన్నుల పండువుగా జరుగుతున్నాయి. ఆరో రోజు పరశురామ అవతారంలో శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తికి బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. సువర్ణ పుష్పాలతో అర్చన చేశారు.
పరశురామ అవతారంలో భద్రాద్రి రామయ్య - తెలంగాణ వార్తలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరో రోజు పరశురామ అవతారంలో కొలువుదీరారు.
పరశురామ అవతారంలో భద్రాద్రి రామయ్య
మధ్యాహ్నం మహా నివేదన అనంతరం పరశురామ అవతారంలో ఉన్న భద్రాద్రి రామయ్య చిత్రకూట మండపంలోకి వేంచేసి... భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షికి జన్మించి పరుశరాముడు అనే నామకరణంతో దుర్మార్గులైన రాజులను దండించారని పురాణాలు చెబుతున్నట్లు ఆలయ వేద పండితులు తెలిపారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల శుక్ర గ్రహ బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కాస్త ఆలోచించకపోతే.. ఖర్చయిపోతాం