తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhadradri: నాలుగో రోజు అధ్యయనోత్సవాలు.. నరసింహ అవతారంలో స్వామివారు

Bhadradri: భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా ఆంక్షల్లో భాగంగా తిరువీధి సేవను రద్దు చేసి నిత్య కల్యాణ మండపం వద్దనే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీరామచంద్రమూర్తి నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Bhadradri: నాలుగో రోజు అధ్యయనోత్సవాలు.. నరసింహ అవతారంలో స్వామివారు
Bhadradri: నాలుగో రోజు అధ్యయనోత్సవాలు.. నరసింహ అవతారంలో స్వామివారు

By

Published : Jan 6, 2022, 12:27 PM IST

Bhadradri: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన నేడు శ్రీ సీతారామచంద్ర స్వామి నరసింహ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ప్రధాన ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మంగళ వాయిద్యాల నడుమ నిత్య కల్యాణ మండపం వద్దకు కదిలివచ్చి నరసింహ అవతారంలో పూజలందుకున్నారు.

నరసింహ అవతారంలో ఉన్న స్వామి వారికి ఆలయ అర్చకులు వేదపండితులు వేదమంత్రాల నడుమ దీప నైవేద్యాలు సమర్పించారు. కరోనా ఆంక్షల్లో భాగంగా తిరువీధి సేవను రద్దు చేసి నిత్య కల్యాణ మండపం వద్దనే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

భక్తులకు అనుమతి నిరాకరణ

దేశంలో ఒమిక్రాన్ రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలంతా ఒకచోట గుమికూడి ఉండరాదని, ర్యాలీలు సభలు నిర్వహించి రాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈనెల 12, 13న జరగనున్న తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనాలకు భక్తుల అనుమతిని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈనెల 12న తెప్పోత్సవం, 13న ఉత్తరద్వార దర్శనం.. వేద పండితులు, అర్చకుల సమక్షంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.

ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతునందున భక్తులకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆన్​లైన్​లో అమ్మిన టికెట్లకు సంబంధించిన నగదు తిరిగి భక్తులకు చెల్లిస్తామని అన్నారు. ప్రజలు, భక్తులందరూ సహకరించి తెప్పోత్సవం ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరు కావొద్దని అన్నారు. గోదావరి తీరంలో జరుగుతున్న హంస వాహనం ఏర్పాట్ల పనులను నిలిపివేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details