తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) ప్రక్రియ వేగం పెంచాలని అధికారులను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) ఆదేశించారు. ఈ నేపథ్యంలో 100 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యంగా అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్తా తగ్గుముఖం పట్టడంతో టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకురావడం లేదు. దీంతో భద్రాచలంలో వైద్యసిబ్బంది రోడ్లపై వెళ్తున్నవారిని ఆపి మరీ టీకాలు వేశారు. మొదటి రెండవ డోసులు వేసుకున్నారా? లేదా ? అని అడిగి మరి వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) చేశారు.
భద్రాచలంలో వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) వేగవంతంగా పూర్తి చేయడానికి పన్నెండు బృందాలుగా విడిపోయి ఆయా సెంటర్లలో టీకాలు వేస్తున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలోని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) వేసుకొని వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. భద్రాచలంలోని ప్రధాన సెంటర్ లైన్ బ్రిడ్జి సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, రామాలయం, అంబేడ్కర్ సెంటర్, మార్కెట్ ఏరియా ఐదు సెంటర్లలో ప్రతి ఒక్కరిని పిలిచి మరి వ్యాక్సిన్ వేసుకున్నారా? లేదా? అని అడిగి మొదటి, రెండు డోసులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) చేస్తున్నారు. మిగలిన 7 బృందాలు పట్టణంలోని అన్ని కాలనీలలో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.