తెలంగాణ

telangana

ETV Bharat / state

పందులకు దాణాగా రేషన్ బియ్యం.. నూకలుగా చేసి దుర్వినియోగం - ఇల్లందు తాజా వార్తలు

పేదలకు రేషన్‌ కార్డు ద్వారా ఉచితంగా అందే బియ్యం దుర్వినియోగం అవుతోంది. నిరుపేదలకు అందాల్సిన రేషన్‌ పక్కదారి పడుతోంది. రేషన్‌ బియ్యాన్ని నూకలుగా చేసి పందులకు దాణాగా వినియోగిస్తున్నారు కొంతమంది మిల్లర్లు. ఇలా చేస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు.

రేషన్‌ బియ్యాన్ని పందుల దానాగా వినియోగం
రేషన్‌ బియ్యాన్ని పందుల దానాగా వినియోగం

By

Published : Jun 27, 2020, 8:27 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రభుత్వ రేషన్‌ బియ్యాన్ని పందుల దాణాగా వాడుతున్నారు మిల్లర్‌ యజమానులు. బియ్యాన్ని నూకలుగా పొడి చేసి పందులకు పెడుతున్నారు. కొందరు మిల్లర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఐదు క్వింటాళ్ల బియ్యం, 2 క్వింటాళ్ల నూకలను స్వాధీనం చేసుకున్నారు. గుండగాని వెంకన్న, నలమాస నాగయ్యలపై కేసు నమోదు చేశారు.

ప్రభుత్వం రూ. 32కు బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుందని.. ఆ బియ్యాన్ని కొందరు ఐదు రూపాయలకు విక్రయించడం నేరమని డిప్యూడీ తహసీల్దార్‌ ముత్తయ్య హెచ్చరించారు. ప్రజల అందాల్సిన బియ్యం ఇలా పందులకు దాణాగా మార్చుతున్న మిల్లును సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీచూడండి:గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details