తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందులో అట్టహాసంగా ఉర్సు ఉత్సవాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ వేడుకల్లో ఇల్లందు పురపాలక ప్రజాప్రతినిధులు గంధం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

By

Published : Dec 14, 2020, 10:22 AM IST

ursu celebrations at yellandu
ఇల్లందులో అట్టహాసంగా ఉర్సు ఉత్సవాలు

మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా కార్తిక మాసంలో వచ్చే ఉర్సు ఉత్సవాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అట్టహాసంగా జరుగుతున్నాయి. పట్టణ సమీపంలోని హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా ఈ వేడుకలకు వేదికైంది. ఘనంగా నిర్వహిస్తోన్న 18వ ఉర్సు ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

మొట్టమొదటిసారిగా ఇల్లందు పురపాలక ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో గంధం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని దర్గా నిర్వాహకులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details