భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బొమ్మనపల్లి వద్ద 12 లక్షల విలువైన గంజాయిని టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కిషోర్ కుమార్, కొమరారం చెందిన బానోతు రమేశ్ బొమ్మనపల్లి ప్రాంతం గుండా గంజాయిని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
ఆటోలో గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్టు - latest news of bhadradri kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొమ్మనపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాని ఖరీదు సుమారు 12 లక్షలు ఉంటుందని తెలిపారు.
ఆటోలో గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్టు
తమను చూసి ఆటో వదిలేసి డ్రైవర్, మరో వ్యక్తి పారిపోయారని వారు వెల్లడించారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 లక్షల విలువైన గంజాయితో పాటు మూడు బైకులు, రెండు చరవాణీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్