తెలంగాణ

telangana

ETV Bharat / state

చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు అరెస్ట్​ - కూర్నాపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్

మందుపాతర అమర్చేందుకు పేలుడు పదార్థాలతో వచ్చిన మావోయిస్టు దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూర్నాపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు వెంబడించారు. అందులో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి 10 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, కార్డేక్స్ వైర్, ఎలక్ట్రిక్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.

two-maoists-arrested-in-charla-zone-in-bhadradri-kothagudem-district
చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు అరెస్ట్​

By

Published : Jan 25, 2021, 4:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్​పీఎఫ్​ 141 బేటాలియన్ సిబ్బంది సంయుక్తంగా కూర్నాపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెంబడించారు. అందులో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి 10 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, కార్డేక్స్ వైర్, ఎలక్ట్రిక్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.

కోవాసి భీమయ్య డోకూపాడు, ఛత్తీస్​గడ్.. సోడి దీపక్ బూరుగుపాడు, చర్ల మండలానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. వారిద్దరూ మూడు సంవత్సరాలుగా అజ్ఞాత సాయుధ సీపీఐ మావోయిస్టు దళానికి కొరియర్లుగా వ్యవహరిస్తూ.. స్థానిక చర్ల ఏరియా మావోయిస్ట్ కమిటీకి అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు. వీరు నాలుగు నెలల క్రితం చర్ల మండలం, కలివేరు జంక్షన్ వద్ద అమర్చిన మందుపాతరల కేసులో నిందితులుగా ఉన్నారు.

గతేడాది డిసెంబర్​లో ఛత్తీస్​గడ్ పుట్టపాడులో జరిగిన ఎన్కౌంటర్​కు ప్రతీకారంగా కూంబింగ్​కు వచ్చే పోలీసులను హతమార్చాలని ప్రణాళిక వేశారు. సీపీఐ మావోయిస్టు అగ్రనాయకుల ఆదేశాల ప్రకారం వీరిద్దరు.. కుర్నాపల్లి గ్రామస్థుల సహకారంతో అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చేందుకు పేలుడు పదార్థాలతో వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో కూంబింగ్​లో ఉన్న పోలీసులకు తారసపడగా.. వారిని పట్టుకున్నారు.

ఇదీ చూడండి:స్థానిక సంస్థల నిర్వీర్యానికి ప్రభుత్వాల కుట్ర: జడ్పీటీసీలు

ABOUT THE AUTHOR

...view details