భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రాగులపాడు గ్రామం వద్ద కలకలం రేగింది. ఇద్దరు మావోయిస్టు కొరియర్లను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడం వల్ల అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్ - భద్రాచలంలో మావోయిస్టుల పత్రాల కలకలం
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం రాగులపాడు వద్ద ఇద్దరు మావోయిస్టు కొరియర్లను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన శ్యామల రవి, దుమ్ముగూడెం మండలం వీరభద్రం గ్రామానికి చెందిన కనితి వెంకటేశ్వర్లుగా గుర్తించినట్లు తెలిపారు.
![ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్ ASP RAJESH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6458977-163-6458977-1584551928664.jpg)
దుమ్ముగూడెంలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్
చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన శ్యామల రవి, దుమ్ముగూడెం మండలం వీరభద్రం గ్రామానికి చెందిన కనితి వెంకటేశ్వర్లుగా గుర్తించామన్నారు. వీరి వద్ద మావోయిస్టు కరపత్రాలు, గోడ పత్రికలు ఉన్నాయని.. ఇందులో విప్లవ నినాదాలు రాసిఉన్నట్లు వివరించారు. వీరిని రిమాండ్కు తరలిస్తామన్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.
దుమ్ముగూడెంలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్