భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారంలో సైకిల్‌ను తప్పించబోయి 2 ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో శెట్టిపల్లి గ్రామానికి చెందిన తిరుప రమేశ్, రమ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక వైద్యశాలకు తరలించారు.
సైకిల్‌ను తప్పించబోయి బైకులు ఢీ - crime news in telugu
సైకిల్‌ను తప్పించబోయి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారంలో జరిగింది.
సైకిల్‌ను తప్పించబోయి బైకులు ఢీ
అనంతరం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మహిళ తలకు తీవ్రమైన గాయం కాగా... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం మహిళను ఖమ్మం తరలించారు.