భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. బ్రిడ్జి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు చేపట్టిన ర్యాలీలో... తెదేపా, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించగా... పోలీసులు అభ్యంతరం తెలిపారు. చాలాసేపు వాగ్వాదం జరిగిన అనంతరం... దీక్షను బ్రిడ్జి సెంటర్కు మార్చారు.
భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ - tsrtc employes strike in bhadrachalam
భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. చాలాసేపు పోలీసులకు, కార్మికులకు వాగ్వాదం జరిగింది.
![భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4710073-thumbnail-3x2-ralley.jpg)
భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ