భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఉదయం నుంచే నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. బస్సులను అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల బస్సులు అడ్డుకోవటం వల్ల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మణుగూరులో డిపోలకే పరితమైన బస్సులు - TSRTC Employees strike in Manugur
ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. మణుగూరు బస్సు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు ధర్నా నిర్వహించారు.

మణుగూరులో డిపోలకే పరితమైన బస్సులు