తెలంగాణ

telangana

ETV Bharat / state

తాత్కాలిక డ్రైవర్​ను చితకబాదిన ఆర్టీసీ కార్మికులు - telangana rtc employees strike 2019

మహిళా కండక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ తాత్కాలిక డ్రైవర్​ను ఆర్టీసీ కార్మికులు చితకబాదిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది.

తాత్కాలిక డ్రైవర్​ను చితకబాదిన ఆర్టీసీ కార్మికులు

By

Published : Oct 29, 2019, 1:39 PM IST

తాత్కాలిక డ్రైవర్​ను చితకబాదిన ఆర్టీసీ కార్మికులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సాయి ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ... డిపో వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళా కండక్టర్లు.. తమ వైపు చేయి చూపిస్తూ తాత్కాలిక చోదకుడు సాయి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అక్కడే ఆందోళన చేస్తున్న మరికొందరు ఆర్టీసీ కార్మికులు.. సాయిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఆర్టీసీ మహిళా కండక్టర్లు, తాత్కాలిక డ్రైవర్​ పోలీస్​ స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details