భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పోటీ చేస్తున్నారు. పట్టణంలో ఉదయం వ్యాయామానికి వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు.
జోరుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం - palla rajeswar reddy news
ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో బుధవారం ఉదయం వ్యాయామానికి వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి
అనంతరం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ వద్ద ఉద్యోగులను పల్లా కలిశారు. కేటీపీఎస్ గేట్ వద్ద ఉద్యోగులను పలకరించిన ఆయన.. అటుగా వాహనాల్లో వెళ్లే వారిని ఆపి ఎన్నికల్లో తనను భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు. ప్రచారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రానికి మరో కలికితురాయి... కొత్త రింగు రోడ్డుకు మార్గం సుగమం