దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి పథకాలు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ఆ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు.
'దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెరాస ప్రవేశపెట్టింది' - Bhadradri Kothagudem District Latest News
భద్రాచలంలో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. కళాశాలల, పాఠశాలల అధ్యాపకులను, న్యాయవాదులను కలిసి ఓటు వేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
!['దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెరాస ప్రవేశపెట్టింది' Trs MLC candidate Palla Rajeshwar Reddy visited In Bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10897373-356-10897373-1615032070458.jpg)
భద్రాచలంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పల్లా పర్యటించారు. కళాశాలల, పాఠశాలల అధ్యాపకులను, న్యాయవాదులను కలిసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.