భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సహకార సంఘ ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు విజయఢంగా మోగించారు. 8 స్థానాల్లో విజయం సాధించి ఇల్లందు సొసైటీని కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డులకు గాను ఒక స్థానం ఏకగ్రీవం కాగా... మిగిలిన 12 స్థానాల్లో 8 తెరాస, 4 న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. దశాబ్దాలుగా ఓటమి ఎరగని న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా సొసైటీ చేజారినట్లైంది. గతంలో పట్టున్న వార్డుల్లో సైతం న్యూడెమోక్రసీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ఇల్లందులో తెరాస మద్దతుదారుల విజయఢంకా - PACS ELECTION NEWS IN TELUGU
సహకార సంఘాల్లో తెరాస మద్దతుదారులు విజయకేతనం ఎగరేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సహకార సంఘ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించారు.
![ఇల్లందులో తెరాస మద్దతుదారుల విజయఢంకా TRS MEMBERS WINNING IN ILLANDHU PACS ELECTIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6084951-thumbnail-3x2-lll.jpg)
TRS MEMBERS WINNING IN ILLANDHU PACS ELECTIONS