తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీలింగ్​ భూముల సమస్యను హరిప్రియ పరిష్కరిస్తారు' - trs meeting on ceiling land problem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మామిడి గుండాలలో సీలింగ్ భూముల సమస్య పరిష్కారంపై తెరాస నాయకులు సమావేశం నిర్వహించారు. పాతికేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని.. గులాబీ నేతలపై అనవసరంగా విమర్శలు గుప్పించేందుకే ఇలా చేస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు.

trs meeting at illandu on ceiling land problem for tribals
'సీలింగ్​ భూముల సమస్యను ఎమ్మెల్యే హరిప్రియ పరిష్కరిస్తారు'

By

Published : Jul 3, 2020, 12:15 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మామిడి గుండాలలో సీలింగ్ భూముల వ్యవహారంలో న్యూ డెమోక్రసీ, తెరాస పార్టీ మధ్య పరస్పర విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సీలింగ్ భూముల సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నర్సయ్య.. కలెక్టర్, ఇతర అధికారులను కోరగా.. తెరాస నాయకులు సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలో పాతికేళ్లు పాలించిన న్యూ డెమోక్రసీ పార్టీ వారు ఈ సమస్యపై అప్పుడెందుకు దృష్టి సారించలేదని.. ఇప్పుడెందుకు తెరాసపై విమర్శలు చేస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. 1994లో 428 మంది గిరిజనులకు సీలింగ్​ పట్టాలు పంపిణీ చేసి.. వారికి సరిహద్దులు చూపించకపోవటం వల్లే వివాదం జరుగుతోందని... దీన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే హరిప్రియ కృషి చేస్తున్నారని తెరాస నేతలు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details