భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగిన తెరాస నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా పూర్తి చేయాలని ఎంపీ కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారన్నారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీని ఇచ్చిన ఓటర్లకు నామా నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. అశ్వరావుపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఆయన వివరించారు.
"అశ్వరావుపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నా" - trs-meeting-at-ashwaraopeta
అశ్వరావుపేటలో తెరాస నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. అశ్వరావుపేట అభివృద్దికి తాను కట్టుబడి ఉన్నట్లు ఎంపీ వెల్లడించారు.
"అశ్వరావుపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నా"