భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లిలో కరోనాతో చనిపోయిన సతీశ్ అనే వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు తెరాస యువ నేతలు. కుటుంబసభ్యులు ముందుకు రానివేళ.. తామున్నామంటూ చివరి మజిలీ పూర్తి చేశారు.
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన తెరాస నేతలు
కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియలకు అయినవారూ ముందుకు రావడం లేదు. చనిపోయిన వారి నుంచి వైరస్ తమకెక్కడ సోకుతుందోననే భయంతో దిక్కులేని వారిగా వదిలేస్తున్నారు. చాలా సందర్భాల్లో బయటి వ్యక్తులే కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.
గ్రామానికి చెందిన కోడూరి సతీశ్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ... పరిస్థితి విషమించడంతో ప్రాణాలు వదిలాడు. కొవిడ్‌తో చనిపోవడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తెరాస నేతలు ఉడుముల రవీందర్ రెడ్డి, దొడ్డ శ్రీనివాస రెడ్డిలు ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మానవత్వంతో కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన నేతలను గ్రామస్థులు అభినందించారు.
ఇదీ చూడండి: 206 రైతు వేదికలు నిర్మించాం: పల్లా రాజేశ్వర్ రెడ్డి