గిరిజన ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజన సంఘాల నాయకులు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాన్ని నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు.
'గిరిజన ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలి'
గిరిజన ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు భద్రాచలంలో ఆందోళన చేపట్టారు. బ్రిడ్జి సెంటర్ నుంచి నినాదాలు చేస్తూ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఐటీడీఏ పీవో గౌతమ్‌కు వినతి పత్రం సమర్పించారు.
'గిరిజన ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్ రద్దుచేయాలి'
బ్రిడ్జి సెంటర్ నుంచి నినాదాలు చేస్తూ ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్ నిలిపివేయాలని కోరుతూ ఐటీడీఏ పీవో గౌతమ్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:'ఫార్మా కంపెనీల పేరుతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది'