పోడు భూముల కోసం గిరిజనులు పోరు ప్రారంభించారు. అటవీశాఖ అధికారుల నుంచి వాటిని కాపాడాలని నినాదాలు చేశారు. పట్టాలు తక్షణమే మంజూరు చేయాలని భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
పోడుభూములకు పట్టాలివ్వాలంటూ గిరిజనుల ధర్నా - పోడుభూములకై గిరిజనులు ఆందోళన
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
పోడుభూములకు పట్టాలివ్వాలంటూ గిరిజనుల ధర్నా
నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ప్రదర్శనకు గిరిజనులు భారీగా హాజరయ్యారు. ర్యాలీ అనంతరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గిరిజనులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు ప్రధాన గేట్లను మూసివేశారు. దీంతో వారంతా అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అనుమతితో ఐటీడీఏ పీవో గౌతమ్‌ను కలిసిన నాయకులు వినతిపత్రం అందించారు.