భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. అనంతరం కలివేరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అటవీశాఖ అధికారులు గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆరోపించారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: ఎమ్మెల్యే వీరయ్య - ఎమ్మెల్యే పొదెం వీరయ్య
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భద్రాద్రి జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆరోపించారు.
![పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: ఎమ్మెల్యే వీరయ్య Tribal peoples strike for podu lands in Bhadrachalam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7997398-685-7997398-1594554797238.jpg)
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ధర్నా
అటవీ శాఖ చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.