భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం పంచాయతీలో మారుమూల గ్రామం బట్టుగూడెంలో...మహిళ పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడింది. గ్రామానికి సరైన దారి లేకపోవడంతో స్థానిక యువకులు... గర్భిణీని మోసుకుంటూ ఆరు కిలోమీటర్లు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆటో ద్వారా …. ఏఎన్ఎం రాజేశ్వరి సాయంతో సత్యనారాయణపురం వైద్యశాలకు తరలించారు. ఏఎన్ఎం చేసిన సాయానికి పలువురు అభినందనలు తెలిపారు.
మారుమూల గ్రామంలో పురిటినొప్పులతో గర్భిణి ఇబ్బంది - garbhine_kastalu
అదో మారుమూల గ్రామం. ఆ గ్రామానికి సరైన దారిలేక స్థానికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మారుమూల గ్రామానికి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు ఏఎన్ఎం రాజేశ్వరి. అక్కడ ఉన్న గిరిజనులకు ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు పోస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.
మారుమూల గ్రామంలో పురిటినొప్పులతో గర్భిణి ఇబ్బంది
TAGGED:
garbhine_kastalu