తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీలింగ్​ భూములను గిరిజనులకు పంపిణీ చేయాలి' - జూలూపుపాడులో గిరిజనుల ఆందోళన

కొత్తగూడెం జిల్లాలోని సీలింగ్​ భూములను గిరిజనులకు పంపిణీ చేయాలని జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివాసి సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. పోడుభూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వాలని కోరుతూ తహసీల్దార్​కు వినతి పత్రాన్ని సమర్పించారు.

Tribal leaders expressed concern for Sealing lands in the district should be distributed to the tribals in bhadradri kottagudem district
'సీలింగ్​ భూములను గిరిజనులకు పంపిణీ చేయాలి'

By

Published : Feb 16, 2021, 8:05 PM IST

పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్​కు వినతి పత్రాన్ని సమర్పించారు.

జిల్లాలోని సూరారం, నల్లబోడు బండ గ్రామాల పరిధిలోని సీలింగ్​ భూములను ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి సంఘం నేతలు డిమాండ్​ చేశారు. పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:14 రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా: మల్లాడి కృష్ణారావు

ABOUT THE AUTHOR

...view details