భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉపరితల గని ప్రాంతానికి చెందిన గిరిజన నిర్వాసిత యువకులు సింగరేణి సంస్థ ఛైర్మన్ శ్రీధర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారుర. జీవో నెంబర్ 34 ప్రకారం తమకు ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్డులతో సింగరేణి భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలి : గిరిజన నిర్వాసితులు
తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఇల్లందు ఉపరితల గని గిరిజన నిర్వాసిత యువకులు సింగరేణి సంస్థ చైర్మన్ శ్రీధర్‌ను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. జీవో నెంబర్ 34 ప్రకారం తమకు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించి.. ఆదుకోవాలని విన్నవించారు.
సింగరేణి అధికారులు మొండి వైఖరి మార్చుకొని వెంటనే ఇల్లందు గిరిజన నిర్వాసితులకు సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలని గిరిజన నిర్వాసిత యువకులు కోరారు. అక్టోబర్ 9న హైకోర్టులో కేసు వాయిదా ఉన్నందున.. అధికారులు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటించి.. అన్ని కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ దిలీప్ కుమార్, బొల్లి రాజు, లావుడియా రవి కిరణ్, వాంకుడోత్ కిరణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.