నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న మద్యం దుకాణాల ఎదుట గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.
వైన్స్ షాపులను మూసివేయించిన గిరిజన సంఘాలు - బెల్టు షాపులు
వైన్స్ షాపుల దోపిడి వల్ల గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భద్రాచలంలోని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. దుకాణాల ఎదుట ఆందోళనకు దిగి.. షాపులను మూసివేయించారు.

వైన్స్ షాపులను మూసివేయించిన గిరిజన సంఘాలు
దుకాణాలకు అనుమతి లేకపోయినా సిట్టింగులు నిర్వహిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమానులంతా సిండికేట్గా ఏర్పడి మద్యాన్ని బెల్టు షాపులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వైన్స్ షాపుల దోపిడి వల్ల గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే రెండు షాపులను మూసివేయించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:బార్లో బీరు సీసాతో దాడి.. ఒకరు మృతి