తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం: పువ్వాడ

భద్రాచలం ఏరియా ఆసుపత్రిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పీఎస్ఏ ఆక్సిజన్ కాన్సంట్రేట్ ప్లాంట్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ప్రారంభించారు. కరోనా బాధితులతో మాట్లాడి.. వారికి పండ్లు, పౌష్టికాహారం, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని కొవిడ్ బాధితులకూ మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Minister Puvada Ajay Kumar, Bhadrachalam Area Hospital

By

Published : May 18, 2021, 1:47 PM IST

మారుమూల ప్రాంతాల్లోని కొవిడ్ బాధితులకూ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి.. ముందుగా పీఎస్ఏ ఆక్సిజన్ కాన్సంట్రేట్ ప్లాంట్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ప్రారంభించారు. అనంతరం కరోనా బారిన పడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. పండ్లు, పౌష్టికాహారం, మంచినీరు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.

శుభ పరిణామం:

రాష్ట్రంలో 6 మెడికల్ కాలేజీలకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని.. అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడానికి అనుమతివ్వడం శుభ పరిణామమని మంత్రి అన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకల కొవిడ్‌ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను ప్రారంభించామని అన్నారు. కరోనా బాధితులకు సెంట్రల్ ఆక్సిజన్‌తో పాటు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ ఎన్‌వీ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్, ఆసుపత్రి డీఎంహెచ్‌వో శిరీష, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల

ABOUT THE AUTHOR

...view details