భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకుమట్ల మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి ధాటికి పలు గ్రామాల్లోని ఇళ్ల రేకులు ఎగిరిపోగా.. మరికొన్ని పగిలిపోయాయి. కూలిన చెట్లు ఇళ్లపై పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
గాలివాన బీభత్సం... ప్రజలకు మిగిల్చెను నష్టం.. - bhadradari kaottagudem district latest news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల పరిధిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన గాలి ఉద్ధృతికి పెద్ద సంఖ్యలో చెట్టు నేల కూలాయి. అకాల వర్షం ధాటికి మెుక్కజొన్న, మామిడి పంటను నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన భీభత్సం
గాలి ధాటికి మొక్కజొన్న పంట నేల వాలిపోయింది. గాలివాన బీభత్సానికి పంట తీవ్రంగా నష్టపోయిందని మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం... సాగర్ ఉపఎన్నికలపై చర్చ