తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్‌ న్యూస్ @9PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News: టాప్‌ న్యూస్ @9PM
Telangana Top News: టాప్‌ న్యూస్ @9PM

By

Published : Jul 8, 2022, 8:59 PM IST

  • అమర్​నాథ్​ గుహ వద్ద వరద బీభత్సం..

జమ్ముకశ్మీర్​లో కుండపోత వర్షాలతో అమర్​నాథ్​ గుహ వద్ద ఆకస్మిక వరదలు పోటెత్తాయి. కొండల పైనుంచి వర్షపు నీరు ముంచెత్తగా.. పలువురు గల్లంతయ్యారని తెలిసింది. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ సహా ఇతర సంస్థలు కలిసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఐదుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. అయితే మరణాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • తెలంగాణకు రెడ్ అలర్ట్..

red alert issued for telangana: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెండు రోజుల పాటు రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల రెండ్రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

  • విజృంభిస్తున్న కరోనా.. 600 దాటిన కొత్త కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 600 దాటాయి. తాజాగా 608 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో ఇప్పటి వరకు 8,05,137 మంది వైరస్ భారీన పడ్డారు. మరో 459 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 7,95,880 మంది కొవిడ్ నుంచి కొలుకున్నారు. దీనితో ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

  • జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. శుక్రవారం దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది.

  • గుండెపోటా? జ్వరమా?

ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. విక్రమ్​కు గుండెపోటు వచ్చిందని వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదని సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇంతకీ ఏమైంది? కావేరి ఆస్పత్రి వైద్యుల మాటేంటి?

  • 'విజయమ్మ రాజీనామా, రాజశేఖరరెడ్డి వారసులెవరు?'

వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. దీనిపై వైఎస్ షర్మిల సమాధానం ఏంటీ? వైఎస్సార్ వారసలెవరు.. జగన్‌తో వచ్చిన వివాదం సంగతేంటి..? తదితర ప్రశ్నలకు.. షర్మిలా స్పందన ఏంటీ? తెలుసుకోవాలంటే కింది కథనం ఓసారి చదవండి.

  • రఘురామకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు.

  • ద్రౌపది కోసం భాజపా పక్కా ప్లాన్..

రాష్ట్రపతి ఎన్నికలను అధికార ఎన్డీఏ.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. తమ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక.. సాఫీగా సాగేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమ పార్టీకి చెందిన సభ్యుల ఓట్లన్నీ పోలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది భాజపా. అందుకోసం ముందుగానే దిల్లీకి రావాలని పార్టీ ఎంపీలకు.. వర్తమానం పంపినట్లు తెలుస్తోంది.

  • సిరీస్​పై కన్నేసిన భారత్​

ఇంగ్లాండ్​తో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌కు సన్నద్ధమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న రెండో టీ20లో గెలిచి.. సిరీస్​ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సిరీస్​ గెలుచుకొని.. టెస్టులో జరిగిన పరాజయానికి టీమ్​ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

  • మణిరత్నం 'పొన్నియిన్‌ సెల్వన్‌' టీజర్‌

స్టార్​ డైరెక్టర్​ మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'పొన్నియన్​ సెల్వన్-1​' సినిమా వచ్చేసింది. చోళ రాజ్యం నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా చాలా.. విజవల్​ వండర్​గా నిలిచిపోయే అవకాశం ఉంది. టీజర్​లోని డైలాగ్స్​ కట్టిపడేశాయి.

ABOUT THE AUTHOR

...view details