భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టేకులపల్లి అటవీ పరిధిలో పులి సంచారం(tiger wandering video) కలకలం రేపుతోంది. మెట్లగూడెం సమీపంలోని జంగలపల్లి గేట్ వద్ద పులి రోడ్డు దాటుతుండగా అటవీ సిబ్బంది, వాహనదారులు గమనించారు. మూడురోజుల క్రితం ఓ కుక్క చనిపోగా... ఆ వాసన పసిగట్టి వచ్చినట్టు గుర్తించారు. పులి తిరుగుతున్న దృశ్యాలను వాహనదారులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అటవీశాఖ సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. మరోవైపు పాల్వంచ వన్యప్రాణి అభయారణ్యం(tigers habitat) పరిధిలో లక్ష్మీదేవి మండలంలో పశువులపై(tiger attack cattle) పులి దాడి కలకలం రేపింది. ఆవులమందపై పులి దాడి చేయడంతో ఓ ఆవు మృత్యువాత పడింది.పంచాయతీ పరిధి తోకల బంధాల గ్రామానికి చెందిన గొప్ప రఘుబాబుకు కిన్నెరసాని వద్ద కొంత స్థలం ఉంది. ఆన ఎనిమిది ఆవులను అక్కడే కట్టేయగా... శుక్రవారం సాయంత్రం సమయంలో వాగు దాటి వచ్చిన పులి... ఆ ఆవులమందపై దాడి చేసింది.
భయం.. భయంగా..
ఈ దాడిలో గాయపడిన మరో ఆవు... తాడు తెంపుకుని పెద్దగా అరుస్తూ ఇంటికి చేరుకుంది. అనుమానంతో వాగు వద్దకు వెళ్లిన రఘుబాబు సంఘటనా స్థలికి వచ్చారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి దాడిలో ఓ ఆవు మృతి చెందిందని... మరికొన్ని పశువులు గాయపడ్డాయని చెప్పారు. ఇకపోతే అటవీ ప్రాంతాలకు చెందిన తాము భయభ్రాంతులకు గురవుతున్నట్లు బాధితుడు రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు.